‘కన్నప్ప’తో రేంజ్ మారుతుందా ?

9
- Advertisement -

టాలీవుడ్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. తాజాగా రెండో దశ షెడ్యూల్ మొదలు పెట్టింది. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. తన తండ్రి మోహన్ బాబుతో విష్ణు మంచు ఈ వీడియోలో కనిపించారు. ఇక కన్నప్ప సినిమాలో “మహాదేవుడి” పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రభాస్ లుక్ కూడా చాలా పవిత్రంగా ఉంటుందని.. ప్రభాస్ విజువల్స్ కూడా అదిరిపోతాయట.

‘భ‌క్త క‌న్న‌ప్ప‌’ని ఎలాగైనా పాన్ ఇండియా సినిమాగా తీసుకురవాలని మంచు విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. అన్నట్టు ఈ చిత్రంలో ప్రభాస్ మహా శివునిగా అదే విధంగా పార్వతీ దేవిగా నయనతార కనిపించనుంది. అలాగే, ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ లు ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది స్టార్స్ పేర్లు కూడా ఈ సినిమాలో యాడ్ కాబోతున్నాయని టాక్. ఇందులో భాగంగా మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ కూడా ఓ కీల‌క పాత్ర చేయ‌నున్నాడని, ఆదివాసీ తెగ‌కు సంబంధించిన ఒక పాత్ర‌లో మోహ‌న్‌లాల్ మెర‌వ‌నున్నాడు. బాలయ్య బాబు కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడట.

ఈ క్రమంలో బాలయ్యని ఎలా చూపించబోతున్నారు ?, ఏ పాత్రలో చూపించబోతున్నారు ? అనేది చూడాలి. అలాగే, ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల నటించబోతుంది. ఇప్పటికే ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె చేతికి కన్నప్ప ప్రాజెక్ట్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా హిట్ అయితే, ఇక మంచు విష్ణు రేంజ్ మారిపోయినట్టే.

Also Read:పీవీ బయోపిక్.. ‘హాఫ్ లయన్’

- Advertisement -