కొత్త దర్శకుడితో స్వధర్మ్ ఎంటర్‌టైన్మెంట్స్ మూవీ..

250
swadharm Entertainment Production No 2 Announced
- Advertisement -

మ‌ళ్లీరావా ఫేమ్ స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 ప్రారంభం..మ‌ళ్లీ రావా లాంటి రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ను అందించిన నిర్మాణ సంస్థ స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్. తొలి సినిమాతోనే క‌థాబ‌లం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని త‌న ప్ర‌త్యేక‌థ‌ను చాటుకున్న నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ నుంచి రెండో ప్ర‌య‌త్నంగా మ‌రో సినిమాకు శ్రీ‌కారం చుట్టారు రాహుల్.

మ‌ళ్లీరావా త‌ర్వాత ఎన్నో క‌థ‌లు విన్నాను,నూత‌న ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్ జే చెప్పిన‌ కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాం. యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టించిన ఆల్ ఇండియా బ‌క్చోద్ కార్య‌క్ర‌మంతో గుర్తింపు తెచ్చుకున్న న‌వీన్ పొలిశెట్టిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాం. మెంట‌ల్ మ‌దిలో చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి మాట‌లు రాస్తుండ‌టం విశేషం.”ఆ” సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్ కె రాబిన్ అందుకున్న ఈ ఫిలింకి సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే ఆర్టిస్ట్స్ అండ్ టెక్నిషన్స్ వివరాలు తెలియచేస్తాం అని నిర్మాత రాహుల్ యాదవ్ తెలియచేసారు

నిర్మాణ సంస్థ‌: స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్,నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా,సంగీత ద‌ర్శ‌కుడు: మార్క్ కె రాబిన్,సినిమాటోగ్ర‌ఫర్: స‌న్నీ కుర‌పాటి,ఎడిటర్: అమిత్ త్రిపాఠి,మాట‌లు: వివేక్ ఆత్రేయ‌,క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: స్వ‌రూప్ ఆర్ఎస్ జే.

- Advertisement -