తాప్సీ నీవు యావరేజ్…

262
Probably little bit of acting-taapsee
- Advertisement -

తెలుగు తెరపై తనకుంటూ గుర్తింపు నేర్పర్చుకుని ప్రస్తుతం బాలీవుడు సినిమాలతో బీజీ అయిన అందాల బ్యూటీ తాప్సీ. ఆమెకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ‘మన్మర్జియా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‎లో భాగంగా అనురాగ్, తాప్సీ సరదాగా మాట్లాడుకుంటూ స్నాక్స్ తింటున్న ఒక ఫోటోను తాప్సీ ట్విట్టర్‎లో పోస్ట్ చేసింది.

‎Probably little bit of acting-taapsee

అయితే ఆ ట్వీట్‎ని ఉద్దేశించి హర్జోత్ సింగ్ అనే యువకుడు తాప్సిపై కామెంట్ చేశాడు. అసలు నిన్ను హీరోయిన్‎గా ఎవరు తీసుకున్నారంటూ.? నువ్వేం పెద్దగా అందంగా ఉండవని యావరేజ్‎గా ఉంటావని ట్వీట్ చేశాడు. దీనికి తాప్సీ దీటుగా సమాధానమిస్తూ… ‘బహుశా నా నటన చూసి అవకాశం ఇచ్చి ఉంటారు. యావరేజ్‌గా ఉండటంలో తప్పేం లేదు కదా? ప్రపంచంలో ‘యావరేజ్’ అనేది అతిపెద్ద కేటగిరీ’ అని ట్వీట్‌ చేసింది.

గతంలోనే ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాని ఓ ఇంటర్వూలో ఆమె పేర్కొన్నారు. అందుకే తన చెల్లెలు సినిమా రంగంలోకి వస్తానన్నా రావొద్దని చెప్పానని పేర్కొన్నారు. ‘జుడ్వా 2’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న తాప్సి ‘ముల్క్‌’, ‘సూర్మా’ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు.

- Advertisement -