సోనియా పాత్రలో బెర్నెర్ట్..

213
- Advertisement -

దేశమాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవిత ఆధారంగా మూవీ రాబోతోన్న విషయం తెలిసిందే. సంజయ్‌బారు రాసిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ పుస్తకం ఆధారంగా ఈ మూవీని  రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మన్మోహన్‌ పాత్రలో అనుపమ్‌ కేర్‌ నటిస్తున్నారు.

అయితే మరో కీలక పాత్రైన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీగా ఎవరు నటించనున్నారని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే సోనియా పాత్రలో కనిపించేది నేనేనంటూ ట్విట్టర్‌ వేదికగా చెప్పేసింది జర్మన్‌ నటి సుజానే బెర్నెర్ట్‌.

Suzanne Bernert: German actress to play Sonia Gandhi in 'The...పలు భారతీయ సినిమాల్లో, పలు భాష టీవీ షోల్లో బెర్నార్ట్‌ నటించారు. అంతకుముందు సుజానే ‘ప్రధానమంతి’ టెలివిజన్‌ సిరీస్‌లో కూడా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలిగా నటించారు. కాగా.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ సోనియా గాంధీ అని ట్విట్టర్‌లో పేర్కొంది బెర్నార్ట్‌. ఇక ఈమె బెంగాలీ, మరాఠి, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడగలరని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా..విజయ్‌ గుట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ్‌ కేర్‌తోపాటు అక్షయ్‌ ఖన్నా కూడా నటిస్తున్నాడు. డిసెంబర్‌ 21న ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.

- Advertisement -