ఖమ్మం నగరానికి మరో సుందర దృశ్య కావ్యం అవిష్కృతం కాబోతావుంది. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌లో టూరిజం డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులు రూ.8 కోట్లతో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పైలాన్ పనులు పూర్తి చేసుకున్నాయి. లక్నవరం, కోమటి చెరువులో మాదిరిగా ఖమ్మం లకరంలో సస్పెన్షన్ బ్రిడ్జి(తీగల వంతెన) నిర్మించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనల మేరకు అద్భుత నిర్మాణం ఆవిష్కరణ కాబోతావుంది.
పనులు మొదలు పెట్టిన నెల రోజుల వ్యవధిలోనే ట్యాంక్ బండ్‌లో నీరు ఖాళీ చేసి భూగర్భం నుండి పటిష్టంగా పైలాన్ నిర్మాణం పూర్తి చేశారు. రెండు వైపులా 80 అడుగుల ఎత్తుతో అతి తక్కువ సమయంలో పైలాన్ ను పూర్తి చేసిన నిర్మాణ సంస్థ. కొరియా నుండి రోప్(తాడు) రావాల్సి ఉంది. ఇప్పటికే ఆయా తాడుకు ఆర్డర్ చేయడమైంది. తాడు వచ్చిన వెంటనే బిగించడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి రానుంది. పైలాన్ పనులు పూర్తి కావడంతో యధావిధిగా NSP జలాలతో లకారం ట్యాంక్ బండ్‌ను నింపితున్నారు ఇరిగేషన్ అధికారులు.