జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోయినప్పటికి పవన్ పోటీ చేసే స్థానంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో అసలు పవన్ ఏం ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. పార్టీల యొక్క అధినేతలు పోటీ చేసే స్థానాలపై ఏపీ ప్రజల్లో ఓ క్లారిటీ ఉంది. వైఎస్ జగన్ పులివెందుల, చంద్రబాబు నాయుడు కుప్పం, నారా లోకేశ్ మంగళగిరి… ఇలా అందరి విషయంలోనూ ఓ క్లారిటీ ఉంది కానీ ఒక్క పవన్ విషయంలోనే ఆ క్లారిటీ మిస్ అయిందనే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికి కనీసం పవన్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇవ్వొచ్చు కదా అనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. .
గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ రెండు చోట్ల కూడా ఓటమి చవిచూశారు. దాంతో ఈ సారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మళ్ళీ భీమవరం నుంచే పవన్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. అయితే పిఠాపురం సీటపై కూడా పవన్ ఆసక్తి కనబరుస్తున్నారని టాక్. ఎందుకంటే పిఠాపురం నియోజక వర్గంలో టీడీపీ జనసేన సానుభూతిపరుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ పవన్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ అని భావిస్తున్నారట.
ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుంగగానే ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు పవన్. అక్కడ క్లీన్ స్వీప్ చేసే లక్ష్యంతో పవన్ ప్రచారం ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు పవన్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వస్తే జనసేనపై ప్రజల్లో నమ్మకం కుదురుతుందని, ఆ తర్వాత బలంగా ప్రచారాలు చేస్తే ఫలితం ఉంటుందనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అలా కాకుండా తాను పోటీ చేసే స్థానంపైనే క్లారిటీ లేకపోతే ప్రజలు నమ్మడం కష్టమే అనేది కొందరి అభిప్రాయం. మరి పవన్ సీటుపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
Also Read:Revanth Reddy: గుంపు మేస్త్రి పాలన.. ఇదేనా?