వామ్మో షర్మిల..రేస్ లో కాంగ్రెస్!

26
- Advertisement -

ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల రాకతో కొత్త ఊపిరొచ్చింది. అసలు పార్టీనే లేదు అనే పరిస్థితి నుంచి ఎన్నికల బరిలో ప్రత్యర్థులను బయపెట్టెలా తిరిగి రేస్ లోకి వచ్చింది. షర్మిల నాయకత్వం సంగతి అటుంచితే.. ఆమె చేసే పదునైన వ్యాఖ్యల కారణంగా ఏపీ కాంగ్రెస్ జోరు పెరిగింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉంటుందని ఇప్పటికే స్పష్టత రాగా.. 175 నియోజక వర్గాల్లో పోటీలో చేస్తున్నట్లు ప్రకటించి రాజకీయాన్ని మరింత హీటెక్కించారు. ఇక ప్రస్తుతం హస్తం సీట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు నమోదు కావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. దరఖాస్తుల గడువు స్వీకరణ శనివారంతో ముగియగా ఇప్పటికే 800కు పైగా దరఖాస్తును నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇంకా ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉండడంతో సీట్ల కేటాయింపు ఆసక్తికరంగానే ఉండనుంది..

పైగా వైసీపీ నుంచి కూడా హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కారణంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకొనున్నాయనేది ఆసక్తికంగా మారింది. ప్రస్తుతం షర్మిల బహిరంగ సభలు, జిల్లాల పర్యటనలు నిర్వహిస్తూ దూకుడు చూపిస్తున్నారు. ఇంకా అధికార వైసీపీ పై కూడా విమర్శలు గుప్పిస్తు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని బాగా హైలెట్ చేస్తూ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు షర్మిల. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదా పైనే ఉంటుందని ఏపీ ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నారు. మొత్తానికి పాతాళంలో కూరుకుపోయిన హస్తం పార్టీని పైకి తేవడమే కాకుండా ఎన్నికల రేస్ లో కూడా నిలబెట్టారు షర్మిల. మరి హస్తం పార్టీ ప్రభావం ముందు రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:Revanth Reddy: గుంపు మేస్త్రి పాలన.. ఇదేనా?

- Advertisement -