సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్.. ‘బహుముఖం’

16
- Advertisement -

యంగ్ ట్యాలెంటెడ్ హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం బహుముఖం. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్ జార్జియా, USA పరిసర ప్రాంతాలలో అనేక ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ఇటీవలే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు, దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు చిత్ర టీజర్‌ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

నిర్బంధ కేంద్రంలో కొన్నేళ్ళు గడిపిన తర్వాత, తన్వీర్ తన కౌన్సెలింగ్ సెషన్‌లలో భాగంగా ప్రతి నెలా సైకోథెరపిస్ట్ దిశను కలుస్తాడు. నటుడిగా తన, తన తల్లి కలను కొనసాగించడానికి ఆమె నుండి సహాయం కోరతాడు. అయినప్పటికీ, తన చుట్టూ ఉన్న వ్యక్తులకు ముప్పు కలిగించే టెర్రిఫిక్ సీక్రెట్స్ తనకి తెలుసు. థ్రిల్లింగ్ రివీల్‌లు, కథలో ఊహించని మలుపులతో ఈ ఉత్కంఠభరితమైన డ్రామాలో కథ ప్రేక్షకులని అందులో లీనం చేస్తుంది.

టీజర్‌ని బట్టి చూస్తే సినిమాకు బహుముఖం అనే టైటిల్‌ యాప్ట్‌. ఈ వీడియో కథానాయకుడి వివిధ షేడ్స్ చూపిస్తుంది. హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నాడు. అతను రచన, దర్శకత్వంతో సహా ఇతర విభాగాలను కూడా అద్భుతంగా నిర్వహించాడు. స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా తమ పాత్రలలో చక్కగా రాణించారు.

ల్యూక్ ఫ్లెచర్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ఎసెట్. క్రిస్టల్ మౌంటైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి అరవింద్ రెడ్డి సహ నిర్మాత. రామస్వామి, హర్షివ్ కార్తీక్ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీత దర్శకుడు. గ్యారీ బిహెచ్‌తో పాటు ఎడిటింగ్ కూడా చూసుకుంటారు హర్షివ్ కార్తీక్. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న డైరెక్టర్ శశికిరణ్ తిక్క మాట్లాడుతూ..’బహుముఖం’ టీజర్ చాలా ప్రామెసింగ్ గా వుంది. నాకు చాలా నచ్చింది. టీజర్ లో విజువల్ తో పాటు సౌండ్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సౌండ్ డిజైన్ చాలా బావుంది. శ్రీచరణ్ బీజీఎం అదరగొట్టారు. కార్తిక్ చాలా హార్డ్ వర్క్ చేశారు. టీజర్ చూసినప్పుడు అది కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ..ఇది సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమా నేపధ్య సంగీతం చేశాను. ఎక్కడా రాజీపడకుండా చేయడం జరిగింది. చాలా ప్యాషన్ తో కష్టపడి ఈ సినిమా చేశారు కార్తిక్. తప్పకుండా అందరూ ఆదరించాలి’ అని కోరారు.

Also Read:KTR:లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటాం

- Advertisement -