చాలా రోజుల తర్వాత మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ భామ సుస్మితా సేన్ స్టెప్పులు వేసింది. ముంబైలో స్థానికంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దర్శించుకుంది. అమ్మవారికి హారతి ఇచ్చి, తన పెద్ద కుమార్తె రెనీతో కలిసి స్టెప్పులు వేసింది. పూజా కార్యక్రమం అనంతరం వీరిద్దరూ చేతిలో ధూపం పట్టుకుని డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
తన కూతురితో పాటు అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహిచండం చాలా సంతోషంగా ఉందని.. ఇది ఎంతో భక్తితో కూడుకున్న భావన అని పోస్ట్ పెట్టింది. తాను వెలిగించిన ఈ ధూపం బాగా పరిమళించి చుట్టు పక్కల ఉన్నవారిలో ప్రేమ, ఆశ, మానవత్వాన్ని నింపాలని సుస్మిత కోరుకున్నట్లు చెప్పింది. ఇక సుస్మిత చేసిన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే మూడు లక్షల మందికిపైగా వీక్షించడం చెప్పుకోదగ్గ విషయం.
https://www.instagram.com/sushmitasen47/?utm_source=ig_embed