నేచురల్ స్టార్ నాని “జెర్సీ” ప్రారంభం

280
- Advertisement -

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం “జెర్సీ”. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యవేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఇవాళ దుర్గష్టమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది మూవీ యూనిట్.

ఈ కార్యక్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ జెర్సీ సినిమాలో నాని సరసన కన్నడ యూటర్న్ ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ సినిమాను నాని డబుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి రెగ్యులర్‌గా ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశం తెలిపారు.

- Advertisement -