కూతురుతో క‌టింగ్ చేయించుకున్న చిరు‌..!

598
Sushmita Konidela
- Advertisement -

నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కోలా తమకు నాన్నపై ఉన్న ప్రేమను తెలుపుతున్నారు.. తాజాగా మెగా డాటర్‌ సుష్మిత కూడా తనకు నాన్న చిరంజీవిపై ఉన్న ప్రేమను కాస్త కొత్తగా చూపించింది. ఫాదర్స్ డే సందర్భంగా సుష్మిత పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఈమె చేస్తున్న పని చూసి అభిమానులతో పాటు అంతా షాక్ అయిపోయారు.

క‌రోనా వ‌ల‌న బార్భ‌ర్ షాప్‌కి వెళ్ళాలంటే భ‌య‌పడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో చిరంజీవికి కూతురు సుష్మిత క‌టింగ్ చేసింది. ఫాద‌ర్స్ డే రోజు సుస్మిత పోస్ట్ చేసిన ఈ వీడియోని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సుస్మిత చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150, సైరా చిత్రాల‌కి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు.

- Advertisement -