ఆలియాభట్ కు షాకిచ్చిన సుశాంత్ సింగ్ ఫ్యాన్స్

432
alia bhatt
- Advertisement -

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చ‌ర్చాంశ‌నీయంగా మారింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రెటీలు స్పందిస్తున్నారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య వెనుక ప‌లువురు బాలీవుడ్ స్టార్ హీరోల హ‌స్తం ఉంద‌ని బ‌హిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. వాళ్లు పెట్టిన మానసిక క్షోభ కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.

సుశాంత్ ఆత్మ‌హ‌త్య వెనుక బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ప్రమేయం ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోన్న నేపథ్యంలో ఆమెకు సుశాంత్ అభిమానులు షాకిచ్చారు. ఆలియా భ‌ట్ మీద ఆరోప‌ర‌ణ‌లు వ‌స్తుండ‌‌టంతో ట్వీట్ట‌ర్ లో ఆ‌మెను ఫాలో అవుతున్న సుశాంత్ అభిమానులు అన్ ఫాలో చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఆలియాకు ఒక్క‌సారిగా అంద‌రూ అన్ ఫాలో చేస్తున్నారు. ఆమె తక్కువ వ్యవధిలోనే 4.45 లక్షల మంది ఫాలోవర్స్ కోల్పోయింది. ఆలియా భట్ తో పాటు నిర్మాత క‌ర‌ణ్ జోహార్, సల్మాన్ ఖాన్ ల‌ను అన్ ఫాలో చేస్తున్నారు.

- Advertisement -