లాల్‌బాగ్ రాజా సన్నిధిలో సూర్య

5
- Advertisement -

కోరిన కోరికలన్నీ నెరవేర్చే స్వామి”ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్ రాజా (Lalbaugcha Raja) గణపతిని టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టితో కలిసి దర్శించుకున్నారు. గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా పండల్‌కు విచ్చేసిన ఈ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు.

దర్శనం అనంతరం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. పోయినసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఒక పాప (కుమార్తె) కలగాలని లాల్‌బాగ్ రాజాను వేడుకున్నాం. ఆ స్వామి ఆశీస్సులతో మాకు రత్నం లాంటి కుమార్తె జన్మించింది. అందుకే ఈసారి ప్రత్యేకంగా గణనాథుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే ఇక్కడికి వచ్చాం” అని వెల్లడించారు.

గత ఐదేళ్లుగా ఇక్కడికి వస్తున్నా..లాల్‌బాగ్ రాజాపై తనకున్న భక్తిని చాటుకుంటూ.. నేను గత ఐదు ఆరేళ్ల నుంచి క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నాను. ఇక్కడ కోరుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది, ఇక్కడి ప్రార్థనల్లో ఎంతో శక్తి ఉంది అని అన్నారు. భారత్ వరల్డ్ కప్ గెలవాలని భక్తులు రాసిన చీటీలను పండల్‌లో చూసిన రోజులను గుర్తుచేసుకున్న సూర్యకుమార్, లాల్‌బాగ్ రాజా ఆశీస్సులు ఎల్లప్పుడూ దేశంపై మరియు తన కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. సూర్యకుమార్ దంపతుల రాకతో లాల్‌బాగ్ రాజా పండల్ వద్ద కోలాహలం నెలకొంది.

Also Read:వెరైటీ డిషెస్..ఆసక్తికర అంశం!

- Advertisement -