భారత స్టార్ బ్యాట్స్‌మెన్, మిస్టర్ 360 సూర్యకుమార్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు. గత ఏడాది పొట్టి క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలుగొట్టిన సూర్య 187.43 స్ట్రయిక్ రేట్‌తో 1164 రన్స్ సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఒక క్యాలెండర్ ఏడాదిలో వేయి పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది 68 సిక్సర్లు బాదిన అతడు టీ20 క్రికెట్ చరిత్రలో ఒక సంవత్సరం అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా మరో రికార్డూ నెలకొల్పాడు.
భారత మహిళల పేస్ బౌలింగ్‌లో సరికొత్త తార రేణుకా సింగ్ ఐసీసీ ‘ఎమర్జింగ్ ఉమెన్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ లేపాడు. బుధవారం తాజాగా విడుదల చేసిన జాబితాలో సిరాజ్ మొత్తం 729 పాయింట్లతో.. హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్‌ను వెనక్కునెట్టి నెం:1 ర్యాంక్‌ను దక్కించుకొన్నాడు.
ఇవి కూడా చదవండి..