T20:కోహ్లీని దాటేసిన సూర్య!

4
- Advertisement -

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా అద్భుత ఫామ్‌తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా వరల్డ్‌కప్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కొండంత బలాన్నిచ్చింది. ఇక కెప్టెన్‌గా సూర్య..విరాట్ కోహ్లీని దాటేశాడు.

జూలై 2024లో భారత టీ20 జట్టు బాధ్యతలు చేపట్టారు సూర్యకుమార్ యాదవ్‌ . జూన్ 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం, నెల రోజులకే సూర్య కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి వరుసగా ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. అతడి నాయకత్వంలో భారత్ 41 మ్యాచ్‌లలో 31 విజయాలు సాధించింది. దీంతో టీ20ల్లో భారత్‌కు మూడో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్య నిలిచాడు.

గువాహటీలో జరిగిన మ్యాచ్‌లో కేవలం 10 ఓవర్లలోనే 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని సూర్యకుమార్ దాటాడు. కోహ్లీ 2017 నుంచి 2021 మధ్య 50 మ్యాచ్‌లలో 30 విజయాలు సాధించాడు. ఈ జాబితాలో ఇప్పుడు సూర్య ముందున్నది కేవలం ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ మాత్రమే. రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీ రికార్డును కూడా అతడు చేరుకునే అవకాశం ఉంది.

టీ20ల్లో భారత్‌కు కెప్టెన్‌గా అత్యధిక విజయాలు

రోహిత్ శర్మ – 49
ఎంఎస్ ధోనీ – 42
సూర్యకుమార్ యాదవ్ – 31
విరాట్ కోహ్లీ – 30

Also Read:విమాన ప్రమాదాలు..మృతి చెందిన నేతలు వీరే!

ఇక బ్యాటింగ్‌లో కూడా సూర్య పరుగుల వరద కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనే అతడు 171 పరుగులు సాధించాడు. టీ20ల్లో 3000 పరుగుల మైలురాయికి అతడు కేవలం 41 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ క్రమంలో, అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రికార్డును సూర్య బద్దలు కొట్టే అవకాశం ఉంది.

- Advertisement -