ముగిసిన సూర్యగ్రహణం..

406
Solar Eclipse 2020
- Advertisement -

నేడు ఉదయం మొదలైన సూర్యగ్రహణం ముగిసింది. సూర్యుడికి జాబిల్లి అడ్డురావ‌డంతో గ‌గ‌న త‌లంలో వ‌ల‌యాకార సుంద‌ర దృశ్యం క‌నువిందు చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 9.15 గంట‌లకు సూర్య‌గ్ర‌హ‌ణం మొద‌లైంది. మ‌న దేశంలో మాత్రం ఉద‌యం 10.14 గంట‌ల‌కు గ్ర‌హ‌ణం ప్రారంభ‌మైంది. ఈ సూర్య‌గ్ర‌హ‌ణం మ‌ధ్యాహ్నం 3.04 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. గుజరాత్ లోని ద్వారకలో మొదలై చివరిగా అసోంలోని డిబ్రూఘర్‌లో పూర్తైందని తెలిపారు.

ఇక, గ్రహణ ఘడియలు ముగియడంతో దేశవ్యాప్తంగా ఆలయాల్లో సంప్రోక్షణలు మొదలయ్యాయి. ఒక్క శ్రీకాళహస్తి ఆలయం తప్ప దేశంలోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి. సూర్యగ్రహణం ముగిసిన నేపథ్యం ఆలయాలు మళ్లీ తెరుచుకున్నాయి. సంప్రోక్షణ ప్రక్రియ అనంతరం భక్తులను దర్శించుకోనున్నారు.

- Advertisement -