బీజేపీ నేతలు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు..

436
TRS MP Venkatesh Netha
- Advertisement -

కరోనా విషయంలో జేపీ నడ్డా-కిషన్ రెడ్డి-బండి సంజయ్ మాటలు ఆశ్చర్యాన్ని గురిచేసాయన్నారు ప్రభుత్వ విప్ భాను ప్రసాద్ ,ఎంపీ వెంకటేష్ నేత. శనివారం బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై వారు మండిపడ్డారు. ఆదివారం టీఆరెస్ ఎల్పీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ భాను ప్రసాద్ ,ఎంపీ వెంకటేష్ నేత నడ్డా చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

భానుప్రసాద్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయినా నడ్డాకు కరోనా లెక్కలు తెలువకపోవడం హాస్యాస్పదమన్నారు. మరణాల యావరేజ్ రేటు జాతీయ స్థాయిలో 3.26 శాతం ఉంటే.. తెలంగాణ శాతం 2.26 ఉంది. WHO హెచ్చరించినా అంతర్జాతీయ రవాణా ఆపకుండా కరోనా దేశంలోకి ఎంటర్ కావడానికి కారణం బీజేపీ అని మండిపడ్డారు. తెలంగాణ ఇంటలిజెన్స్ చెప్పే వరకు మర్కజ్ వ్యవహారం బయటపడలేదు. కేంద్రం ఆధీనంలో ఉన్న ICMR ఒకమాట చెప్తే-ఆయుష్ ఒక మాట రాష్ట్రాలకు చెప్తుంది.

కరోనా టెస్టుల కోసం రోజుకో దేశం నుంచి రోజుకో కిట్లు తెప్పించి గందరగోళానికి గురి కేంద్రం చేసింది నిజం కాదా?. పేదల కోసం పెట్టె పథకాలు మీకైనా అర్థం అయితయా? రైతులకు-కార్మికులకు బీజేపీ ఏం చేసింది? అని ప్రశ్నించారు. బండి సంజయ్-నడ్డా నోటికి ఎంతవస్తే అంతా మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు!. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో మీరు చెప్పండి? తరువాత మేము ఎం చేశామో చెప్తామని ప్రభుత్వ విప్ భానుప్రసాద్ ప్రశ్నించారు.

ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి-బండి సంజయ్ మాటలు పరిపక్వత లేనివిగా ఉన్నాయి!. కరోనాతో దేశం అంతా ఇబ్బంది పడుతుంటే బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు!. బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడడానికి ఇది సమయమా? అని ఎంపీ ప్రశ్నించారు. కేసీఆర్ పీఎం విడియో కాన్ఫిరెన్సు లో మోడీకి అండగా ఉన్నాము అని మాట్లాడితే.. బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారు మైండ్ దొబ్బిందా?. దేశ సరిహద్దుల్లో చైనా..దేశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఒక్కటే! అన్నారు.

తెలంగాణ అభివృద్ధి-సంక్షేమం ఓర్వలేక బీజేపీ నేతలు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుకు వ్యతిరేకమని టీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది,20లక్షల కోట్ల ప్యాకేజి దేశానికి పనికి రాదని మా పార్టీ చెప్పింది.. అందుకేనా బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు ప్రయత్నం చేయరు. మిషన్ భగీరథ-కాకతీయ దేశానికే ఆదర్శంగా ఉన్నాయి అని నీతి ఆయోగ్ ప్రశంసలు ఇచ్చింది. కరోనా కట్టడిలో కేసీఆర్‌కు వస్తున్న పేరును తట్టుకోలేకనే బీజేపీ తప్పుడు విమర్శలు చేస్తోంది అని ఎంపీ వెంకటేష్ నేత మండిపడ్డారు.

- Advertisement -