మరోసారి తెరపైకి క్యాస్టింగ్ కౌచ్..!

887
survin chawla
- Advertisement -

2009లో వచ్చిన రాజు మహారాజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సుర్వీన్ చావ్లా. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న సుర్వీన్….ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని మరోసారి లేవనెత్తారు.

ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ దర్శకుడు తన శరీర భాగాలను చూడాలనుకున్నాడని, మరో దర్శకుడు తన తొడలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నానంటూ అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించింది. అయితే ఆ దర్శకుల పేర్లను మాత్రం బయటపెట్టేందుకు నిరాకరించింది సుర్వీన్.

తన కెరీర్‌లో ఐదు సార్లు క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలను ఎదుర్కొన్నానని తెలిపింది. మూడు సార్లు దక్షిణాదిలో, రెండు సార్లు బాలీవుడ్‌లో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. తానే ఏడాది పాటు మాత్రమే టీవీలో నటించానని కానీ ఒక్కోసారి అబద్ధం చెప్పాల్సి వచ్చిందన్నారు.

క్రికెటర్ శ్రీశాంత్‌తో కలిసి ఏక్ ఖిలా డీ ఏక్ హసీనా అనే రియాల్టీ డ్యాన్స్ షోలో పాల్గొంది సుర్వీన్ . 2015లో సుర్వీన్ అక్షయ్ థక్కర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. సుర్వీన్ నటించిన చివరి చిత్రం ‘ఛురీ’.

- Advertisement -