గ్రామీణ యాక్షన్ డ్రామా…కరుప్పు!

12
- Advertisement -

కోలీవుడ్ నటుడు సూర్య కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన తదుపరి చిత్రం గ్రామీణ యాక్షన్ డ్రామా “కరుప్పు”.ఆర్జే బాలాజీతో ఆయనకు ఇది మొదటి సినిమా కాగా కరుప్పుపై భారీ ఆశలు పెట్టుకున్నారు సూర్య.

ఈ సినిమా మొదట దీపావళి 2025 సందర్భంగా విడుదల కావాల్సి ఉన్నా.. విస్తృతమైన CG పనుల కారణంగా ప్లాన్ ప్రకారం విడుదల జరగలేదు. తాజా సమాచారం ప్రకారం, నిర్మాతలు రిపబ్లిక్ డే సెలవులు ఉన్న పొడిగిన వీకెండ్‌ను దృష్టిలో ఉంచుకుని 2026 జనవరి 23న విడుదల చేయాలని చూస్తున్నారు.

దీపావళి సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన మొదటి సింగిల్ ‘గాడ్ మోడ్’కు మంచి స్పందన వచ్చింది. త్రిషా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు మరియు ఎస్.ఆర్. ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read:దుల్కర్ సల్మాన్.. ‘కాంత’

- Advertisement -