తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. గవర్నర్ జిష్ణు దేవ్ .. అజార్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సర్కార్‌లో గ్రేటర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మంత్రిగా నిలిచారు అజార్.
అజహరుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మొరాదాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్‌పై 49,107 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2014 లోక్‌సభ ఎన్నికలలో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్‌బీర్ సింగ్ జౌనపురియా చేతిలో 1,35,506 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండగా 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో 16,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించారు అజార్. అయితే కాంగ్రెస్ నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. అదే క్రమంలో అజార్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వగా అది పెండింగ్‌లో ఉంది. తాజాగా అజార్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 15 మంది ఉన్నారు. అజార్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా మరో ఇద్దరికి అవకాశం ఉంది.
Also Read:గ్రామీణ యాక్షన్ డ్రామా…కరుప్పు!

