సూర్య@42.. కంగువ టైటిల్ ఫిక్స్‌

29
- Advertisement -

కోలీవుడ్ స్టార్ సూర్య తమిళనాడులోనే గాక తెలుగు, హిందీ రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా సూర్య 42 సినిమాగా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా పేరు కంగువా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూర్య దిశాపటానీ కీలక పాత్రలపై కేరళలో షూటింగ్ షెడ్యూల్ మొదలైనట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Also read: Tollywood:మళ్లీ నోరు పారేసుకున్న తాప్సీ..!

స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్‌తో కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమా 10భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను 3డీ ఫార్మాట్‌లో కూడా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెకుతున్న సినిమాను 2024ప్రథమార్థంలో విడుదల చేయాడానికి సన్నహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తోన్న సూరారైపోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్ర పోషించనున్నట్టు కోలీవుడ్‌లో టాక్.

Also read: అతనితో సమంత హొయలు

- Advertisement -