మాన్‌స్టర్‌గా సూర్య

255
surya
- Advertisement -

మాన్‌స్టర్‌గా రానున్నాడు హీరో సూర్య. మాయా, మానగరం వంటి చిత్రాలను తెరకెక్కించిన పొటెన్షియల్‌ స్టూడియో బ్యానరు ‘ఒరునాల్‌ కూత్తు’ ఫేమ్‌ నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చివరి షెడ్యూల్‌ శరవేగంగా జరుగతుండగా ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, ప్రియా భవాని శంకర్‌, కరుణాకరన్‌లు నటిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతం సమకూర్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ చిన్నారుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిదిన్నారు. ‘ఒరునాల్‌ కూత్తు’ చిత్రం కన్న సినిమా పెద్ద హిట్ అవుతుందని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇదన్నారు.

చిన్నారులను ఆకట్టుకునే నటుడి కోసం ఎదురుచూస్తుండగా ఎస్‌జే సూర్య గుర్తుకొచ్చారని సినిమాకు ఆయనకే పెద్ద బలమన్నారు. ప్రియా భవాని శంకర్‌ చిత్రానికి అందాన్ని చేకూర్చారని తెలిపారు.

- Advertisement -