కార్తీ నా కంటే పెద్ద హీరో అవ్వాలి- హీరో సూర్య

287
- Advertisement -

కార్తీ, సయేషా హీరో హీరోయిన్‌గా పాండిరాజ్ దర్శకత్వం వహించిన “చినబాబు” చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను హీరో సూర్యతో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి “2డి ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ మరియు “ద్వారకా క్రియేషన్స్” బ్యానర్ లో నిర్మించడం జరిగింది. తాజాగా వైజాగ్‌లో ఈ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు సూర్యతో పాటు కార్తీ, చిత్ర యూనిట్ సభ్యులు అందరు పాల్గొన్నారు. ఈ ఆడియో వేడుకకు హీరో సూర్య ముఖ్యఅతిథిగా వారడం విశేషం.

Hero Karthi

ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ…తెలుగువారందరికి నమస్తే. రైతుల గురించి చినబాబు సినిమాను నిర్మించడం జరిగింది. అందరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ప్యాషన్‌తో నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. తమ్ముడు కార్తీతో సినిమా చెయ్యడం కల నిజం అయినట్లు ఉంది. సింగం3 సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ వచ్చాను అప్పుడు మీరు చూపించిన ప్రేమ మర్చిపోలేను. నా కంటే కార్తీ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్న. కలలు కనండి వాటిని సాధించండి. పాజిటివ్ గా ఉంటె అన్నీ సాధ్యం అవుతాయి. చినబాబు అందరికి నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది” అన్నారు.

Hero Karthi

ఈ చిత్రంలో నటీనటులుగా కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను నటించారు.. సాంకేతిక నిపుణులు: కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : పాండిరాజ్, నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి, బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్, సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్. సంగీతం: డి.ఇమాన్, కెమెరామెన్: వేల్ రాజ్, ఎడిటింగ్: రుబన్.

- Advertisement -