Karuppu: శింబు పాట తొలగింపు!

8
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రం ‘కరుపు’. రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. వేసవి కానుకగా మే 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కొంతకాలం క్రితం ఈ సినిమా నుండి ‘నాంగా నాలు పేరు’ అనే పాటను విడుదల చేశారు. స్టార్ హీరో శింబు (సిలంబరసన్) పాడిన ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే, ఈ పాట నెటిజన్ల నుండి ప్రతికూల స్పందనను మూటగట్టుకుంది. పాటలోని ట్యూన్ మరియు గానంపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ఆర్‌జే బాలాజీ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఆ పాట సినిమాలో ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ట్రోల్స్ వల్లే నేను ఈ పాటను తొలగించానని అభిమానులు అనుకోవచ్చు. కానీ, అసలు ఈ పాటను సినిమా ఫైనల్ వెర్షన్‌లో ఉంచకూడదని మేము ముందే నిర్ణయించుకున్నాం అని బాలాజీ క్లారిటీ ఇచ్చారు. కారణం ఏదైనప్పటికీ, ప్రతికూల స్పందన వచ్చిన తరుణంలో ఆ పాటను తొలగించడం సరైన నిర్ణయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:KTR:పేద విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా

- Advertisement -