ప్రభాస్ అందుకే సర్జరీ చేయించుకుంటున్నాడు!

32
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ త్వరలోనే మోకాలి సర్జరీ చేయించుకుంటారని సినీ వర్గాల సమాచారం. ప్రభాస్ చాలా కాలంగా సినిమాల్లో డాన్స్‌లకు దూరంగా ఉంటున్నాడు. డ్యాన్స్ చేస్తే.. మోకాళ్ళు విపరీతంగా నొప్పులు వస్తాయట. అందుకే.. ప్రభాస్ ఈజీ స్టెప్స్ తోనే ఇన్నాళ్లు బండి లాగించాడు. కానీ, ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పైగా ప్రతి సినిమాకి వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలాంటి హీరో కనీస డ్యాన్స్ కూడా చేయలేక పోతే బాగోదు అని ప్రభాస్ తన మోకాలికి సర్జరీ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ మోకాలి సర్జరీ కోసం ప్రపంచంలోనే ది బెస్ట్ సర్జన్ దగ్గరకు వెళ్తున్నాడు. లోకల్ గా సర్జరీ చేయించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కేవలం.. తన సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభాస్ ఫారెన్ లో ఈ మోకాలి సర్జరీ చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్.. సలార్, కల్కి సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాల షూటింగ్ పూర్తికాగానే మోకాలి సర్జరీ చేయించుకోనున్నారని తెలుస్తోంది. సర్జరీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇస్తారట.

Also Read:చర్మం నల్లబడుతుందా..ఇలా చేయండి!

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరో ఆరోగ్యంపై దృష్టి పెట్టారని కామెంట్లు చెస్తున్నారు. అయితే సర్జరీ తర్వాత ప్రభాస్ షూటింగ్ కి వెళ్లకపోయినా.. సలార్ సినిమాకి మాత్రం డబ్బింగ్ చెబుతాడట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీలో డార్లింగ్ కు జోడిగా శృతి హాసన్ నటించనుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఆగస్టు-15 న ఫస్ట్ సాంగ్, ఆగస్టు నెలాఖరులో ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Also Read:జగన్ కు షాక్…50 మంది టీడీపీ లోకి?

- Advertisement -