మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ‘భోళాశంకర్’ షూటింగ్ పూర్తయ్యాక మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో అమెరికాకు వెళ్లారు. అయితే వారిద్దరు కొద్ది రోజులు విహార యాత్రకు వెళ్లారని అందరూ భావించారు. కానీ, అక్కడికి వెళ్లింది మాత్రం.. చిరు మోకాలి సర్జరీ కోసమని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని మొదట రహస్యంగా ఉంచినప్పటికీ… కాస్త ఆలస్యంగా బయటకు వచ్చేసింది. చిరు కాలికి మైనర్ సర్జరీ జరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు హైకోర్టులో మెగాస్టార్ చిరంజీవికి ఊరట లభించిన సంగతి తెలిసిందే.
గుంటూరులో 2014 ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవిపై కేసు నమోదైంది. కేటాయించిన సమయంలో మీటింగ్ పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో చిరంజీవిపై కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేసింది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి వారసురాలు వచ్చిన తర్వాత చిరు ఇంట్లో అంతా సందడి నెలకొంది.
Also Read:బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసిన బీఆర్ఎస్..
ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. మెహర్ రమేశ్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈనెల 27న అనగా (గురువారం) సాయంత్రం 4.05 గంటలకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. కాగా ఈ సినిమా ఆగస్టు 11న విడుదల అవుతోంది.
Also Read:‘ఓ మై గాడ్ 2’కు సెన్సార్ షాక్!