క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సురేశ్‌ రైనా

181
suresh
suresh
- Advertisement -

టీమిండియా సీనియర్ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఆటకు వీడ్కోలు పలికారు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగిన అతడు .. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దేశానికి, రాష్ట్రానికి ప్రాతినిధం వ‌హించ‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌ని, బీసీసీఐకి, యూపీ క్రికెట్ సంఘానికి, సీఎస్కే, రాజీవ్ శుక్లాకు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు రైనా ట్వీట్ చేశారు. త‌న‌పై నమ్మ‌కం ఉంచిన‌వారికి, మ‌ద్ద‌తు ఇచ్చిన అభిమానుల‌కు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

2005లో వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రైనా టీమిండియా తరపున 226 వన్డేలు, 18 టెస్టులు, 78 టీ20లు మ్యాచ్‌లు ఆడారు. మొత్తంగా 7988 పరుగులు చేశారు. బౌలింగ్‌లో కూడా తన మార్క్‌ ప్రతిభను చూపెట్టారు. వన్డేలో 36 వికెట్లు తీసి అత్యవసర సమయంలో భారత జట్టుకు విజయతీరాలకు చేరవేశారు. 2020లో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించారు. కానీ ఐపీఎల్‌ లోని కొన్ని మ్యాచ్‌లు ఆడారు. 2020, 2021లలో పేలవ ప్రదర్శన వల్ల రైనాను చైన్నై సూపర్‌ కింగ్స్‌ వదులుకొంది. దాంతో రైనాను 2022లోని ఐపీఎల్‌ వేలంలో ఎవరు తీసుకోలేదు. రైనా ఐపీఎల్‌, భారత్‌ మెగా క్రికెట్‌ లీగ్‌ లకు కూడా ప్రాతినిధ్యం వహించారు.

- Advertisement -