సొంతగడ్డపై కవీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సిద్దమైంది. ఈనెల 16న ధర్మశాలలో తొలి వన్డే జరగనుంది. ఆ వన్డేకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా మిస్ కానున్నాడు. వైరల్ ఫీవర్ కారణంగా రైనా తొలి వన్డేకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
Off to the airport to leave for Dharamshala. Beautiful sunny day today ✌😎 #BlessAll pic.twitter.com/4Ci6wRiP4S
— Virat Kohli (@imVkohli) October 13, 2016
ఐదు మ్యాచుల భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఇంటి నుంచి ధర్మశాల బయల్దేరుతున్నట్లు ట్వీట్ చేశాడు. ‘ధర్మశాల వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకి బయలుదేరాను.. ఈ రోజు సూర్యోదయం ఎంతో అందంగా ఉందని.. వన్డే సిరీస్ ఆడేందుకు బయలుదేరుతున్న నన్ను అందరూ దీవించండి..’ అంటూ ఓ ఫొటోని కూడా ట్వీట్ చేశాడు కోహ్లి. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఆటగాళ్లందరూ తమ ఇళ్లకు బయలుదేరారు. రెండు రోజుల ముందే ఇంటికి వెళ్లిన కోహ్లి వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు ఇప్పుడు ధర్మశాల బయలుదేరాడు.
మూడు వన్డేలకు జట్టును ప్రకటించిన సెలక్షన్ టీం.. మిగతా రెండు వన్డేలకు టీమ్‌ను ప్రకటించలేదు. టెస్ట్ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలిచిన అశ్విన్‌తో పాటు జడేజాకు తొలి మూడు వన్డేలకు ఆడడం లేదు. ఢిల్లీ(20న), మొహాలీ(23న), రాంచీ(26న), విశాఖపట్టణం(29న) వేదికలుగా మిగతా వన్డేలు జరగనున్నాయి. అన్నీ మ్యాచ్‌లు మధ్యాహ్నాం 1.30 నిమిషాలకు ప్రారంభంకానున్నాయి.