కేంద్ర మంత్రి పదవికి సురేశ్ గోపి రాజీనామా!

31
- Advertisement -

మూడోసారి పీఎంగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం మోడీతో పాటు కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇక కేరళ నుండి గెలిచిన ఏకైక ఎంపీ సురేష్ గోపి కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

ఇక ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు గడవకముందే రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనకు సహాయ మంత్రి పదవి ఇవ్వడాన్ని సురేష్ గోపి జీర్ణించుకోలేకపోతున్నారని అందుకే రాజీనామాకు రెడీ అయ్యారని కేరళ మీడియా కథనాన్ని ప్రచురించింది.

అలాగే పెండింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌ల‌ను పూర్తి చేసేందుకు.. మంత్రి ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని సురేశ్ గోపి భావిస్తున్నారని చెప్పుకొచ్చింది. కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి న‌న్ను రిలీవ్ చేస్తార‌ని భావిస్తున్నాన‌ని, సినిమాల‌ను పూర్తి చేయాల్సి ఉంద‌ని, ఈ అంశంపై కేంద్ర నాయ‌క‌త్వ‌మే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని సురేశ్‌ గోపి తెలిపారు. ఒక ఎంపీగా తాను త్రిసూరులో మెరుగైన సేవ‌లు అందిస్తాన‌ని, త‌న‌కు కేబినెట్ పొజిష‌న్ అవ‌స‌రం లేద‌ని చెప్పడం విశేషం.

Also Read:Modi:మోదీ కేబినెట్ తొలి భేటీ

- Advertisement -