- Advertisement -
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ బాటపట్టారు హీరో రామ్. తెలంగాణ స్లాంగ్‌లో పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపుగా రూ. 70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
దీంతో అదే స్పీడ్‌ని కంటిన్యూ చేస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు రామ్. తాజాగా సైరా దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు సిద్దమైనట్లు టాక్.
సైరా విడుదలై ఎనమిది నెలలు గడుస్తున్న తన నెక్ట్స్ ప్రాజెక్టు ప్రకటించలేదు సురేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో రామ్ హీరోగా కథ సిద్ధం చేశాడని..దీనికి రామ్ కూడా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రామ్ నటిస్తున్న రెడ్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం.
- Advertisement -