రక్తదాతలకు చిరు అభినందనలు…

282
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు, వాటిలో రక్త నిల్వలు తగ్గకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రక్తదానం చేయదలచుకున్న వారు చేస్తున్నారు.

ఇక ఇవాళ వరల్డ్ బ్లడ్ డోనర్ డే. ఈ సందర్భంగా రక్తదాతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వేలాది మందికి రక్తదానం చేసిన చిరు ఎందరో అభిమానాన్ని చురగొన్నారు. పదుల సార్లు రక్తదానం చేసిన చిరు ఎందరికో స్పూర్తిగా నిలిచారు. మెగాస్టార్ ఒక్కపిలుపుతో తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది రక్తదానం చేయడానికి అనేక సందర్భల్లో ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్బంగా విషెస్ తెలిపారు చిరంజీవి.

- Advertisement -