నా నరణరాల్లో ప్రజాసేవ జీర్ణించుకోపోయింది: సురబీ వానిదేవి

210
vani devi
- Advertisement -

కేసీఆర్ పిలుపు మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నాను. నా నరణరాల్లో ప్రజాసేవ జీర్ణించుకోపోయిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురబీ వానిదేవి తెలిపారు. ఈరోజు ఆమె తెలంగాణ భావన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వానిదేవి మాట్లాడుతూ.. కేసీఆర్ పిలుపు మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నాను. నా నరణరాల్లో ప్రజాసేవ జీర్ణించుకోపోయింది. విద్యాసంస్థలను స్థాపించి విద్య సేవను నేను చేస్తున్నాను అని సురబీ వానిదేవి అన్నారు. విద్యార్థులను 35 ఏళ్లుగా నేను గైడ్ చేస్తూ విద్యాసేవలో పనిచేస్తున్నాను. గడిచిన 35 ఏళ్ల నుంచి 1లక్షకు పైగా విద్యార్థులు మా విద్యాలయాల నుంచి ఉద్యోగాలు పొందారు. చిన్న అణువు నుంచి అంతరిక్షం వరకు నా విద్యార్థులు పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేట్ల సమస్యలు నేను దగ్గర నుంచి చూసాను..ఇప్పుడే గెలిస్తే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేసే అవకాశం దక్కింది. మా నాన్నకు రిటైర్మెంట్ సమయంలో ప్రధాని పదవి వచ్చినట్లు.. నాకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చిందని సురబీ వానిదేవి పేర్కొన్నారు.

- Advertisement -