- Advertisement -
లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని, ఇతర నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
అయితే దీనిపై విచారణను తిరస్కరించిన సుప్రీం….సదరు న్యాయమూర్తికి రూ. లక్ష జరిమానా విధించింది. మద్యం దుకాణాల వ్యవహారంపై ఎన్ని పిటిషన్లు దాఖలు చేస్తారని…. ఈ విషయాన్ని ప్రచారం కోసం వాడుకుంటున్నారని అభిప్రాయపడిన న్యాయస్ధానం రూ. లక్ష జరిమానా విధించింది.
- Advertisement -