పవన్‌ కల్యాణ్‌తో వరంగల్ దర్శకుడి మూవీ..!

243
pawan
- Advertisement -

2019 ఎన్నికల తర్వాత జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తయింది. పింక్ రీమేక్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు.తాజాగా పవన్‌ కోసం కథను సిద్ధం చేస్తున్నానని ప్రకటించారు దర్శకుడు సంపత్ నంది.

ప్రస్తుతం గోపిచంద్‌తో సినిమా చేస్తున్నాని ఈ మూవీ పూర్తికాగానే పవన్‌కు తాను రెడీ చేసిన కథ వినిపిస్తానని చెప్పారు సంపత్ నంది. గతంలో సినిమా చేద్దామని పవన్ మాట ఇచ్చారని అందుకే కథ అంతా రెడీ చేశాక పవన్‌ని కలుస్తానని వెల్లడించారు.

వాస్తవానికి పవన్ హీరోగా తెరకెక్కిన ‘సర్థార్ గబ్బర్‌సింగ్’ చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల ఆయన స్ధానంలో బాబీ వచ్చాడు.

- Advertisement -