ఆర్టీకల్ 370రద్దు.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం

454
supreme-court
- Advertisement -

జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370రద్దుపై భారత అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది.జమ్ము కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్ధు, స్థానిక నేతల అరెస్టులు, మీడియాపై ఆంక్షలు సహా ప్రస్తుతం కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం అక్కడ ప్రసారమవుతున్న వార్త ఛానెల్స్ పత్రికలపై అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్ని జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం ఆదేశించింది.

అలాగేశ్రీనగర్, అనంత నాగ్,బరా ముల్లా, జమ్మూ నాలుగు జిల్లాల్లో పర్యటించేందుకు గులాం నబి ఆజాద్ కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ర్యాలీలు, స్పీచ్ లు , రాజకీయ కార్యక్రమాలు జరపరాదని ఆజాద్ కు ఆంక్షలు విధించింది.

పిటిషన్ దాఖలు చేసేందుకు హైకోర్టు అందుబాటులో ఉందా లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో వ్యక్తిగతంగా మాట్లాడతానన్నారు సీజేఐ రంజన్ గొగొయ్. అవసరమైతే శ్రీనగర్ లో పర్యటిస్తానని అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -