నేటి నుండి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు..

224
supreme-court
- Advertisement -

నేటి నుంచి జూన్ 30 వరకూ సుప్రింకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించింది. సెలవు దినాల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణల కోసం ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. మే 13 నుంచి 20వరకు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది.

మే 21 నుంచి 24 వరకు జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం,మే 25 నుంచి మే 30వరకు సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం, మే 31 నుంచి జూన్‌ 2వరకు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం, జూన్‌ 3నుంచి జూన్‌ 5వరకు జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం, జూన్‌ 6 నుంచి జూన్‌ 13 వరకు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి ధర్మాసనం విచారణ జరపనుంది. జూన్‌ 14 నుంచి జూన్‌ 30 వరకు ధర్మాసనాల వివరాలను తర్వాత వెల్లడిస్తామన్న సుప్రీంకోర్టు వర్గాలు .

- Advertisement -