నుపూర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం…

74
nupur sharma
- Advertisement -

ముహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ బిజెపి నేత నుపూర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తనపై దేశవ్యాప్తంగా వేరువేరు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లను క్లబ్ చేసి ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరపాలని కోరుతూ నుపూర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నుపూర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. టెలివిజన్‌లో నుపూర్ యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలన్న సుప్రీంకోర్టు. నుపూర్ శర్మ వ్యాఖ్యలు కలవరపెడుతున్నాయన్న సుప్రీంకోర్టు. ఈ వ్యాఖ్యలు చేయడానికి ఆమెకు ఎం పని? నుపూర్ శర్మ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి చాలా ఆలస్యమైంది.
అలాగే ‘మనోభావాలు దెబ్బతింటే’ అనేటువంటి షరతులతో ఉపసంహరించుకుందన్న సుప్రీంకోర్టు. దేశంలోని మేజిస్ట్రేట్లు నూపుర్ శర్మకు చాలా చిన్నవారుగా కనిపిస్తున్నారన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. ఒక పార్టీ అధికార ప్రతినిధి అయినంత మాత్రాన.. ఇలాంటి వ్యాఖ్యలు చేసే లైసెన్స్ కాదన్న సుప్రీంకోర్టు.

దేశమంతటా ఆమె భావోద్వేగాలను రగిలించిన తీరు… దేశంలో జరుగుతున్నదానికి ఈ మహిళ ఒక్కరే బాధ్యత వహిస్తుందన్న జస్టిస్ సూర్యకాంత్. నుపూర్ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం. పిటిషన్ వెనక్కి తీసుకున్న నుపూర్ శర్మ.

- Advertisement -