సుప్రీంకోర్టు ఉచితాలపై కమిటీ….

38
supreme
- Advertisement -

హామీల‌ను గుప్పించ‌కుండా రాజ‌కీయ పార్టీల‌ను నియంత్రించ‌లేమ‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల సంక్షేమ ప్ర‌భుత్వాల భాధ్య‌త‌ని, ప్ర‌జా ధ‌నాన్ని స‌రైన ప‌ద్ధ‌తిలో వెచ్చించ‌డ‌మే ఇక్క‌డ ప్ర‌ధాన అంశ‌మ‌ని సీజేఐ నొక్కి చెప్పారు.

ఉచితాల‌పై డీఎంకే దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సర్వోన్న‌త న్యాయస్ధానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి. ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్య‌వ‌హారం చాలా సంక్లిష్ట‌మైన‌ద‌ని, అస‌లు ఈ అంశాల‌ను న్యాయ‌స్ధానం ప‌రిశీలించ‌వ‌చ్చా అనే ప్ర‌శ్న కూడా త‌లెత్తుతుంద‌ని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది. ఈ ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనునకుంటున్నట్లు వెల్లడించింది. ఏది సరైనా హామీ అనేదే ఇక్కడ ప్రశ్న ఉచిత విద్య వైద్యం తాగునీరు వంటి వాటిని ఉచితాలుగా పరిగణించాలా కన్స్యూమర్‌ ఉత్పత్తులు ఉచిత ఎలాక్ట్రానిక్‌ వస్తువులను సంక్షేమ పథకాలుగా అభివర్ణించాలా ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి సరైన మార్గం ఏంటనేదాన్నిపై మనం దృష్టి పెట్టాలన్నారు.

ఉచితాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరికొందరేమో అవన్నీ సంక్షేమ పథకాలని చేబుతున్నారు. దీంతో ఈ అంశం సంక్లీష్టంగా మారుతోంది. అందుకే ఉచితాలపై చర్చించి సూచనలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దీన్నిపై మీ సలహాలు ఇవ్వండి. అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాజ్యదారులకు సూచించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే సంక్షేమ ప‌థకాల‌ను ఎన్నిక‌ల తాయిలాలుగా పేర్కొన‌రాద‌ని డీఎంకే వాదిస్తోంది. విస్తృత‌, బ‌హుళ ఉద్దేశాల‌తో సంక్షేమ ప‌థకాలు అమ‌ల‌వుతాయ‌ని పేర్కొంది. కోర్టు సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని పిటిష‌న‌ర్ హ‌న్స‌రియా కోరారు. భార‌త్ సంక్షేమ రాజ్య‌మ‌ని, సంక్షేమ ప‌థకాలు అవ‌స‌ర‌మ‌ని కమిటీ ఏర్పాటును తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని డీఎంకే త‌ర‌పు న్యాయ‌వాది పీ విల్స‌న్ కోర్టుకు నివేదించారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -