మణిపూర్ దారుణ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. అల్లర్లు సృష్టించడానికి మహిళల్ని పావులుగా చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ చంద్రచూడ్.. మణిపూర్ విషయమై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.ఇది రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత దారుణ పరిణామం. బయటకు వచ్చిన వీడియోల వల్ల మేము తీవ్ర ఆందోళనకు గురయ్యామన్నారు.
ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందానని, ఇది రాజ్యాంగ వైఫల్యమని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదిక ఇవ్వాలని..తదుపరి విచారణ జూలై 28వ తేదీన చంద్రచూడ్ చెప్పారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేం చర్యలకు దిగుతాం. రాజ్యాంగం అమలులో ఉన్న ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదయోగ్యం కాదు. ఇది తీవ్రంగా కలవరపెడుతోందన్నారు. మణిపూర్ కుమార్తెలకు జరిగిన దురాగతాన్ని ఎప్పటికీ క్షమించలేమని పేర్కొన్నారు.
Also Read:భారీ వర్షాలు..మంత్రి హరీష్ సమీక్ష