ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (వెనుకబడిన తరగతులు) రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో జీవోలు జారీ చేసింది. అయితే, ఈ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు, 34 శాతం రిజర్వేషన్లను కొట్టివేస్తూ కీలక తీర్పునిచ్చింది.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరియైనదేనని సమర్థిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Also Read:జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు..కేటీఆర్ దిశానిర్దేశం
సుప్రీంకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టత రావడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

