స్పైవేర్‌ వివాదంపై నివేదికలు అందాయి :సుప్రీం

76
suprem
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌ వివాదంకు సంబంధించిన నివేదికలు సుప్రీంకోర్టుకు అందాయి. ఇజ్రాయెల్‌ కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ రూపోందించిన ఈ స్పైవేర్‌ కొన్ని దేశాలు వినియోగించుకొని …రాజకీయ ప్రముఖులు జర్నలిస్టులు మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్టు గతేడాది జూలైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం తీవ్ర దూమారం దారితీసింది.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సహా దేశంలోని దాదాపు300మంది ఫోన్లను పెగాసస్‌తో హ్యాక్‌ చేసినట్లు అప్పట్లో దివైర్‌ కథనం వెల్లడిందించింది. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టు చేరగా పెగాసస్‌ను వినియోగించారా లేదా అన్నదానిపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిగింది. 29 ఫోన్ల‌ను ప‌రీక్షించ‌గా, దాంట్లో అయిదు ఫోన్ల‌లో మాల్‌వేర్ ఉన్న‌ట్లు గ‌మ‌నించామ‌ని సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. కానీ ఒక్క ఫోన్‌లో కూడా పెగాస‌స్ స్పైవేర్ ఉన్న‌ట్లు గుర్తించ‌లేదు అని కోర్టు తెలిపింది. అయితే పెగాస‌స్ అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డంలేద‌ని క‌మిటీ చెప్పిన‌ట్లు చీఫ్ జ‌స్టిస్ వెల్ల‌డించారు. క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన క‌మిటీనే ఈ రిపోర్ట్‌ను త‌యారు చేస్తోంది. మూడు భాగాలుగా రిపోర్ట్‌ను ఇవ్వ‌నున్నారు. దీంట్లో రెండు టెక్నిక‌ల్ క‌మిటీ రిపోర్ట్‌లు ఉంటాయి. రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ ఆర్వీ ర‌వీంద్ర‌న్ మ‌రో నివేదిక‌ను స‌మ‌ర్పిస్తారు. ర‌వీంద్ర‌న్ స‌మ‌ర్పించే నివేదిక‌ను త‌మ వెబ్‌సైట్‌లో ప‌బ్లిక్‌గా పెట్ట‌నున్న‌ట్లు సీజేఐ తెలిపారు. తొలి రెండు భాగాల‌కు చెందిన రిపోర్ట్ కావాల‌ని కొంద‌రు పిటిష‌నర్లు అడగ్గా దానిపై ప‌రిశీలిస్తామ‌ని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసు విచార‌ణ‌ను మ‌రో నాలుగు వారాల‌కు వాయిదా వేశారు. కేసును విచారించిన ధ‌ర్మాస‌నంలో సీజేఐ ర‌మ‌ణ‌తో పాటు జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు.

- Advertisement -