యూపీ ఘటన..సుప్రీం కీలక వ్యాఖ్యలు

97
Indian Supreme Court

యూపీలోని ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌ నేపథ్యంలో బీజేపీ సర్కార్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఎంత మందిని అరెస్ట్ చేశారు? స‌వివ‌ర‌మైన నివేదిక‌ను శుక్ర‌వారం స‌మ‌ర్పించాల‌ని యూపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది సుప్రీం .

ఈ ఘ‌ట‌న‌లో మృత్యువాత ప‌డిన రైతు ల‌వ్‌ప్రీత్ సింగ్ త‌ల్లి చికిత్స కోసం యూపీ ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన సాయం చేయాల‌ని ఆదేశించింది. ఈ రిపోర్ట్‌లో చ‌నిపోయిన వారి వివ‌రాలతోపాటు ఎఫ్ఐఆర్ స‌మాచారం, ఎవ‌రిని అరెస్ట్ చేశారు, విచార‌ణ క‌మిటీ వంటి మొత్తం స‌మాచారం ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది

ఖేరీలో రైతుల‌పైకి కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు ఆశిశ్ మిశ్రా కారుతో దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే.