తెలంగాణ కాంగ్రెస్ పోస్టులపై సుప్రీం విస్మయం!

4
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ గత కొంతకాలంగా తన అధికారిక వాట్సాప్ చానల్లో చేస్తున్న అసభ్యకరమైన, అబద్ధపు ప్రచారంపై సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.రేవంత్ ఓటుకు నోటు కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో జరిపితే పోలీస్ శాఖ, అవినీతి నిరోధక శాఖలు రెండూ రేవంత్ వద్దనే ఉండటం వల్ల అతను తన అధికారాలను వాడి తప్పించుకోవచ్చు, కనుక ఈ కేసు విచారణ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని వేసిన పిటీషన్ మీద సుప్రీం కోర్టు ఇవ్వాళ విచారణ చేసింది.

రేవంత్ ఎలాంటి వ్యక్తి అనేది నిరూపించడానికి సుప్రీం కోర్టుకు అనేక ఆధారాలు ఇవ్వాళ పిటీషనర్ తరఫు న్యాయవాది సమర్పించినప్పుడు ఈ ఆసక్తికరమైన చర్చ జరిగింది. అడ్డూ అదుపూ లేకుండా, సిగ్గూ, లజ్జా వదిలేసి, అధికారంలో తామే ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా తమ పార్టీ అధికారిక వాట్సాప్ చానల్లో అబద్ధాలను, అసభ్యకరమైన మార్ఫింగ్‌ల చూసి ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టు కూడా ముక్కున వేలేసుకుంది. అందులో పోస్టులను చూసిన న్యాయమూర్తులే ఇవి చాలా ఘోరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక వాట్సాప్ చానల్లో న్యాయమూర్తుల ఫొటోలను కూడా వాడి వారిని బజారుకీడుస్తున్నారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:వరద నష్టంపై కేంద్రం సాయం కోరుతాం: రేవంత్

- Advertisement -