- Advertisement -
వీధి కుక్కలకు స్టెరిలైజేషన్‌పై కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధికుక్కల దాడులపై రోజూ ఇన్ని వార్తలు వస్తున్నా మీలో చలనం లేదా అంటూ అసహనం వ్యక్తం చేసింది.
స్టెరిలైజేషన్‌పై ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు.
ఇప్పటివరకు స్పందించని చీఫ్ సెక్రటరీలు అందరూ తదుపరి విచారణలో తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.
Also Read:ఆటో డ్రైవర్ల సమస్యలు పట్టవా?:హరీష్
- Advertisement -

