- Advertisement -
ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీ, సిలిగురి, బెంగళూరు, నాగ్‌పూర్‌లలో కుక్కలకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని, వాటిని షెల్టర్లకు తరలించి ఇబ్బంది పెట్టొద్దని నిరసనలు చేపట్టారు జంతు ప్రేమికులు.
ఈ నేపథ్యంలో ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించింది సుప్రీం కోర్టు. వీధి కుక్కలకు టీకాలు వేసిన తర్వాత విడుదల చేయాలి అని… అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు.
కరిచే కుక్కలు, రేబిస్ ఉన్న కుక్కలను మాత్రమే షెల్టార్లలో ఉంచాలి అని… వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం ఇవ్వకూడదు అని తేల్చిచెప్పింది.
Also Read:జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
- Advertisement -

