నీట్ కౌన్సెలింగ్, మెడికల్ సీట్ల వ్యవహారంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు అని తెలిపింది సుప్రీం కోర్టు ధర్మాసనం. స్థానికత అంశానికి సంబంధించి పరిష్కారంతో రావాలి అని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేదంటే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. అడ్మిషన్లకు సంబంధించి నీట్‌కు ముందు నాలుగేళ్లు స్థానికంగా చదివి ఉండాలనే నిబంధనతో గతంలో జీవో 33 తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు పలువురు. దీనిపై సుదీర్ఘ వాదనలు విని .. గతేడాది సెప్టెంబర్ 5న విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది ధర్మాసనం. ఈ తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ 11న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ ఎస్ఎల్పీపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బగ్చీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వాదనలు విని పిస్తూ.. తెలంగాణలో పుట్టి పదోతరగతి వరకు చదివినా స్థానిక కోటా దక్కడం లేదని.. 11, 12వ తరగతులను చదవని కారణంగా నీట్లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్లు కోర్టుకు నివేదించారు న్యాయవాదులు.
Also Read:కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్
పలు సందర్భాల్లో కేంద్ర పారామిలటరీ, ఇతర ఉద్యోగాలరీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో పని చేయాల్సి వస్తోందని, అలాంటి వారి పిల్లలు ఈ నిబంధనతో అవకాశాల్ని కోల్పోతున్నారని వాదించారు న్యాయవాదులు.

