- Advertisement -
సుప్రీం కోర్టు మరో సంచలన నిర్ణయం వెలువరించింది. లంచాల కేసులో ప్రజా ప్రతినిధులు విచారణ ఎదుర్కొవాల్సిందేనని ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. లంచాల కేసులో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదని…వారికి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ప్రజా ప్రతినిధులు లంచాలు తీసుకోవడం, అవినీతికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపింది.
1998లో పీవీ నరసింహరావు కేసులో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసం ఇచ్చిన తీర్పును కొట్టేసింది.
Also Read:ఆదిలాబాద్‌కు ప్రధాని..
- Advertisement -