వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. హత్య జరిగి జాలుగేళ్లు అవుతున్న ఇంతవరకు దొషులేవరనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు అరెస్ట్ అయినప్పటికి.. అసలు ధోషులేవరనేది ఇంకా సస్పెన్సే. ప్రస్తుతం ఈ కేసు వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ సీబీఐ ఆయనను విచారణకు ఆదేశించడం.. ఆయనేమో విచారణకు డుమ్మా కొడుతూ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..
ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ ను రద్దు చేయాలని వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. అవినాష్ రెడ్డిపై వెంటనే విచారణ జరిపించాలని, ఆయన సీబీఐకి సహకరించడం లేదని, ఏపీ ప్రభుత్వ అండతోనే ఆయన విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని సునీత పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై ఈ నెల 13న విచారణ చేపడతామని సుప్రీం కోర్ట్ తెలిపింది. కాగా వివేకా హత్య కేసుపై ఈ నెల 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read:15న నాగపూర్ బీఆర్ఎస్ భవనం ప్రారంభం..
ఈలోగా అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం, విచారణపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ( నేడు ) సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది ? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేస్తే.. సీబీఐ ఏం చర్యలు తీసుకోనుంది ? అలా కాకుండా అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇస్తే దర్యాప్తు గడువు చివరి తేదీ ( ఈ నెల 30 ) మాటేంటి అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటన్నిటికి సమాధానం నేడు సుప్రీం కోర్టు చేపట్టే విచారణలో తేలిపోనుంది.
Also Read:మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి కన్నుమూత..