కవితకు ఈడీ సమన్లు..సుప్రీం కీలక ఆదేశం

52
- Advertisement -

ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయొద్దని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. న‌ళినీ చిదంబ‌రం త‌ర‌హాలోనే త‌మ‌కూ ఊర‌ట క‌ల్పించాల‌ని కోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం..ఈడీ వివరణ కోరింది. ఈడీ తరపు న్యాయవాదుల వాదన విన్న న్యాయస్థానం…సెప్టెంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కు స‌మ‌న్లు జారీ చేయొద్ద‌ని ఆదేశించింది.

శుక్రవారం విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంటివద్దే విచారించాలని, సమయపాలన పాటించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈడీ నోటీసులు జారీ చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

Also Read:పవన్ పెద్ద ప్లానే.. అందుకే టీడీపీతో పొత్తు?

- Advertisement -