- Advertisement -
కరోనా చికిత్స చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది వసతి, క్వారంటైన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.వైద్య, ఆరోగ్య సిబ్బందికి జీతాలు చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను రేపు కేంద్రం జారీ చేయాలని న్యాయస్థానం సూచించింది.
కరోనా సంక్షోభంలో వైద్య, ఆరోగ్య సిబ్బందికి జీతాలు చెల్లంచకపోవడం నేరంగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది.రేపటికల్లా హైరిస్క్ లేని సిబ్బందికి క్వారంటైన్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు… క్వారంటైన్ సౌకర్యాలు రాష్ట్రాలు కల్పించేలా కేంద్రం రేపు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది.
- Advertisement -